Wednesday, April 24, 2024
- Advertisement -

మీరు కారణ జన్ములు.. తెలంగాణకు పండుగ రోజు : హరీష్ రావు

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ శ్రేణుల్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ గులాబి పార్టీ నాయ‌కులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు.. కేసీఆర్ కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాంకాలు తెలిపారు.

‘మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది’ అని ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేట పట్టణంలో 10వేలు మొక్కలు నాటే కార్యక్రమానికి హ‌రీష్ రావు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట-నర్సాపూర్ చౌరస్తా నుండి రాజీవ్ రహదారి వెళ్లే రహదారి ఇరు వైపులా మరియు డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు.

జ‌క్క‌న్నా.. మ‌జాకా.. విడుద‌ల‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. ‘వేశ్య’గా యాంకర్‌ అనసూయ!

మాస్టర్ సాంగ్ కు చిందులేసిన‌ అశ్విన్

పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ సీన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -