Friday, May 17, 2024
- Advertisement -

ఏపీ సీఎస్‌, డీజీపీపై హైకోర్టు ఆగ్ర‌హం.. ఈ నెల 27న కోర్టులో హాజరు కావాలని ఆదేశం

- Advertisement -

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగే కోడి పందేల‌పై జ‌ర‌గ‌కుండా చూడాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వ‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కోడిపందేల నిర్వ‌హ‌ణ‌పై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల ఆ పందేలు జరిగిన విషయం తెలిసిందే. కోడి పందేల నిర్వహణపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచార‌ణ స‌మ‌యంలో ఏపీ డీజీపీ, సీఎస్‌ల‌పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల నిర్వహణపై విచారణ నివేదిక సమర్పించనందుకు సీఎస్‌, డీజీపీపై కోర్టు అక్షింత‌లు వేసింది. ఇందులో అల‌స‌త్వం ప‌నికిరాద‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు నివేదిక స‌మ‌ర్పించ‌నందుకు గానూ వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డానికి ఈ నెల 29న వారిద్ద‌రు వ్యక్తిగతంగా కోర్టుకు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -