ఫిబ్రవరి 14.. ఈ డేట్ కోసం ఎంతో మంది ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్ డేస్ రోజు తాము ప్రేమించిన వ్యక్తి కోసం అపురూపమైన కానుకలు ఇస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అహ్మదాబాద్ కు చెందిన వినోద్ భాయ్ పాటిల్ తన భార్య రితాబెన్ పాటిల్ కి ఇచ్చిన కానుక గురించి తెలిస్తే యావత్ ప్రపంచం షెభాష్ అంటారు. ఇది కదా నిజమైన ప్రేమ కానుక అంటారు. రితాబెన్ పాటిల్ గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది.
కిడ్నీ మార్పిడి చేయకపోతే ఆమె జీవితాంతం డయాలసిస్ చేయించుకుంటూ ఉండాల్సిందే. ఆమెకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు భర్త వినోద్ భాయ్ పాటిల్. ప్రేమికుల దినోత్సవం రోజునే తన కిడ్నీతో భార్యకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. వినోద్ భాయ్ ఇచ్చిన కిడ్నీని వాలంటైన్స్ డే రోజునే వైద్యులు రితాబెన్ కు అమర్చారు.
ఈ సందర్భంగా వినోద్ భాయ్ పాటిల్ మాట్లాడుతూ.. పెళ్లైన నాటి నుంచి తన తోడూ నీడగా ఉంటున్న భార్య ఆరోగ్యం క్షీణించడం చూసి తట్టుకోలేకపోయానని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భార్యను ఒంటరిగా ఎలా వదిలేస్తాను అని పేర్కొన్నాడు. అందుకే ఆమెకు కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వినోద్ భాయ్ పాటిల్ తెలిపాడు. వినోద్, రితా దంపతుల 23వ పెళ్లిరోజు కావడం విశేషం.
స్టీల్ సిటీలో లోకేష్ గర్జన..ఉపేక్షించేది లేదు..!