Friday, May 17, 2024
- Advertisement -

ప్ర‌మాదంలో చార్మినార్‌…

- Advertisement -

హైదరాబాద్ లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ ప్ర‌మాదంలో చిక్కుకుంది. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యంకార‌ణంగా హైదరాబాద్‌కే తలమానికం అయిన చార్మినార్‌ కట్టడంలోని చిన్న భాగం కూలింది.ఈ సమయంలో ఘటనాస్థలి వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మినార్‌ నుంచి కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు. అక్క‌డ ఉండే చిరువ్యాపారులు ఆందోళ‌న చెందుతున్నారు. పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు వచ్చి చార్మినార్ ను పరిశీలించారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. రంగులు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది.400 ఏళ్ల చరిత్ర క‌లిగి ఉన్న చార్మినార్‌ను గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆదేశాలతో 1591లో చార్మినార్ ను నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -