Saturday, April 27, 2024
- Advertisement -

అవన్నీ సామాన్యులకే.. నేతలకు కాదు !

- Advertisement -

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనదేశానికి పేరుంది. ఇక్కడ ప్రజలే పాలకులుగా వ్యవహరిస్తారని దాని సారాంశం. అయితే ఈ వాక్యాలలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని ప్రజలు ఎన్నుకున్న నాయకులే ఇక్కడ అసలైన పాలకులు అనేది మాత్రం వాస్తవం. దేశాన్ని పరిపాలించేందుకు ప్రజలు ఓట్లు వేసి రాజకీయ నాయకులకు అధికారాన్ని కట్టబెడితే.. ఆ నాయకులు మాత్రం ప్రజాధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రూల్స్ ప్రజలకే.. మాకు కాదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకెనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సంగటనే ఇటీవల హైదరబాద్ లో చోటు చేసుకుంది..

హైదరాబాబ్ లోని మారేడుపల్లిలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన వాహనాలపై అలాగే రోడ్లపై అమ్ముకునే చిరు వ్యాపారులపై జరిమానా విధించారు. కానీ అక్కడే రూల్స్ కు విరుద్దంగా రోడ్డుపై వాహనం నిలిపిన ఓ రాజకీయ నేతకు మాత్రం ఎలాంటి జరిమానా విధించలేదు. ఈ సంఘటనను ఉమాసుధీర్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ నిలదిస్తూ ట్విట్టర్ లో వీడియోను పోస్టు చేసింది. రూల్స్ కు విరుద్దంగా ఉన్న చిరు వ్యాపారులపై జరిమానా విధిస్తున్న పోలీసులు.. రాజకీయ నేతలు ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది. రూల్స్ సామాన్యులకేనా.. రాజకీయ నేతలకు కాదా, చట్టం ముందు అందరూ సమనులే కదా అంటూ నిలదీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికి రూల్స్ సామాన్యులకే.. పాలకులకు కాదు అనే విషయం ఈ సంఘటనతో మరోసారి రుజువైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -