Saturday, May 18, 2024
- Advertisement -

పీఎస్‌ఎల్‌వి ప్రయోగం సక్సెస్‌

- Advertisement -

దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ సాయంత్రం నాలుగు గంటలకు పీఎస్‌ఎల్‌వి-సీ32 వాహకనౌక నింగిలోకి దూసుకు పోయింది. 44.4 మీటర్ల పొడవు, 1,425 కిలోల బరువున్న ఐఆర్‌ఎస్ఎస్ఎస్‌-1ఎఫ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.

నావిగేషన్‌ వ్యవస్థపై పనిచేసేందుకు వీలుగా ఇస్రో 2013లో తొలిసారిగా ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అదే ఇండిపెండెంట్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌. ఈ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. మార్చి నెలాఖరు నాటికి నావిగేషన్‌ వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -