Friday, May 17, 2024
- Advertisement -

దోమ‌ల నివార‌ణ‌కు విమానాల్లో ఎల‌క్ట్రిక్ బ్యాట్‌లు

- Advertisement -

విమానాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టింది ఇండిగో ఎయిర్‌లైన్. ఇంట్లో దోమ‌ల‌ను చంప‌డానికి అంద‌రూ ఎలక్ట్రిక్‌ బ్యాట్లను ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. కాని ఇప్పుడు ఎలక్ట్రిక్‌ బ్యాట్లను విమానాల్లో ఉప‌యోగించాల‌ని ఉపయోగించాలని ఇండిగో ఎయిర్‌లైన్‌ నిర్ణయం తీసుకుంది. ఒక్కో విమానానికి రెండు ఎలక్ట్రిక్‌ బ్యాట్ల చొప్పున క్యాబిన్‌ సిబ్బంది వీటిని ఉపయోగించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

విమానంలో దోమల బెడదపై ఇటీవల ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన ఎఫెక్ట్ తో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది ఇండిగో ఎయిర్ లైన్స్. దోమలున్నాయని ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రయాణికుడిని దించేయడంతో ఇండిగో వివాదంలోనూ ఇరుక్కుంది.

విమానాల్లో దోమలు ఉంటున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో కొన్నిసార్లు ఆ కారణంగా విమానాలు కూడా ఆలస్యమయ్యాయని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ బ్యాట్లను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామని, ఈ నెల నుంచే వాటిని వినియోగిస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -