Friday, May 17, 2024
- Advertisement -

యోగా విషయంలో ముస్లింలకు భయపడిన మోడీ సర్కారు?!

- Advertisement -

మోడీ ప్రభుత్వం యోగాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ అంశం గురించి అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నట్టుగా కూడా మోడీ ప్రభుత్వం చెప్పుకొంది. జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం అనేది కూడా తమ ఘనతేనని మోడీ సర్కారు ప్రకటించుకొంది.

మరి ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 21 వ తేదీన తొలిసారి అంతర్జాతీ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయనున్నారు. అయితే ఈ విషయంలో మోడీ సర్కారుకు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు  వినిపిస్తున్నాయి.

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ విషయంలో అభ్యంతరం చెప్పింది. యోగాలో భాగంగా చేసే సూర్య నమస్కారం అనేది ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధమని వారు అన్నారు. స్కూళ్లలోని ముస్లిం విద్యార్థులకు యోగాను తప్పనిసరి చేయడం.. వారి చేత మతాచారాలకు విరుద్ధంగా సూర్య నమస్కారం చేయించడం సరికాదని ముస్లిం లాబోర్డు అభ్యంతరం చెప్పింది.
ఈ అభ్యంతరాన్ని మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం విశేషం. వారి అభ్యంతరాలకు అనుగుణంగా యోగాలో సూర్యనమస్కారాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. అయితే ఈ విషయంలో భారతీయనతా పార్టీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ వంటి వారు అభ్యంరతంచెబుతున్నారు. సూర్యనమస్కారం చేయడం ఇష్టం లేని వారు వెళ్లి సముద్రంలో దూకాలి లేదా.. చీకటి గతిలో ఉండిపోవాలని ఆయన వ్యాఖ్యానించాడు. మొత్తానికి మోడీ ప్రభుత్వం అయితే.. ముస్లింల అభ్యంతరాలకు తలొగ్గినట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -