Sunday, April 28, 2024
- Advertisement -

తెలుగురాష్ట్రాలపై.. మోడీ సర్కార్ వివక్ష !

- Advertisement -

2023-24 సంవత్సరానికి గాను కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందా ? అవుననే చర్చ బలంగా జరుగుతోంది. బడ్జెట్ కేటాయింపులలో ఇటు ఏపీకి అటు తెలంగాణకు రావాల్సిన నిధులు రాలేదని రెండు రాష్ట్రాల నేతలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఈ బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పెడ చెవిన పెట్టినట్లే తెలుస్తోంది. .

ఏదో తూ తూ మంత్రంగా కేటాయింపులు జరిగాయి తప్పా.. సంతృప్తినిచ్చే విధంగా జరగలేదని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న ఆవేదన, 15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరానిలో అన్నీ రాష్ట్రాలకు కలిపి రూ.10,21,448 బడ్జెట్ కేటాయింపులు జరుగగా.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా తెలంగాణకు రూ. 21,470 కోట్ల కేటాయింపు జరిగింది. ఇది గత బడ్జెట్ తో పోలిస్తే చాలా తక్కువ అని ప్రధానంగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్లు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి వాటి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.

ఇక తెలంగాణ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనను కూడా కేంద్రం ఈ బడ్జెట్ లో పక్కన పెట్టేసింది. దాంతో తెలుగు రాష్ట్రాలపై ఎందుకింత చిన్నచూపు అనే విమర్శలు చేస్తున్నారు రెండు రాష్ట్రాల నేతలు. అయితే మన పక్కా రాష్ట్రాలు అయిన కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు బాగానే జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చే సరికి ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో కేటాయింపులు జరగడంతో రెండు రాష్ట్రాలలో ఆయా చోట్ల బడ్జెట్ పై నిరసనల బాటా పట్టారు. మొత్తానికి మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన చివరి బడ్జెట్ లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలపై వివక్ష కొనసాగింది అనేది చాలా మంది భావన.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ బాదుడు.. ప్రతిపక్షాల ప్రకంపనలు !

సొంత నేతల దెబ్బ.. జగన్ కు గట్టిగా తాకిందా ?

మోడీ పాలనపై.. ప్రజా నాడీ ఏం చెబుతోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -