Thursday, April 25, 2024
- Advertisement -

మోడీ సర్కార్ పై గుర్రుగా ఉన్న వైసీపీ !

- Advertisement -

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉంది. 151 ఎమ్మెల్యేలతో ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని దక్కించుకున్న జగన్ పార్టీకి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏది ప్రాధమికంగా టీడీపీ పేరు వినిపిస్తుంది. ఆ తరువాత జనసేన, బీజేపీలు ఉంటాయి. అయితే ఇంతవరకు రాష్ట్రంలో ఏపార్టీకి కూడా మద్దతుగా నిలవని వైసీపీ.. కేంద్రంలో మాత్రం మోడీ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తూ వస్తోంది. మొదటి నుంచి కూడా సి‌ఎం జగన్ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

ప్రత్యేక్షంగా వైసీపీ- బీజేపీ మద్య ఎలాంటి పొత్తు లేనప్పటికి.. పరోక్షంగా మాత్రం జగన్ సర్కార్ కేంద్రంలో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నలే చూస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా జగన్ సర్కార్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వైసీపీ సర్కార్ పట్ల ఏమంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆంద్రప్రదేశ్ అప్పుల విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి జైశంకర్ నొక్కి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేసిందనే వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం వైసీపీ కి మరో షాక్ ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చే ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే..ఆంద్రప్రదేశ్ కు బియ్యం మరియు వడ్ల సేకరణ పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా కేంద్రం నుంచి వచ్చే ఉచిత బియ్యని ప్రజలకు పంపిణీ చేయకుండా నిలిపి వేసింది జగన్ సర్కార్. అదే విషయాన్ని చెబుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్.. జగన్ సర్కార్ ను హెచ్చరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు గట్టిగానే మండి పడుతున్నారు. దీంతో బీజేపీ వర్సస్ వైసీపీ అనే చేర్చ తేరపైకి వచ్చింది. అయితే కేంద్రానికి దగ్గరవ్వలని చూస్తున్న వైసీపీ సర్కార్ ను మోడీ ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.

Also Read

కాంగ్రెస్ హస్తం గందరగోళం !

చంద్రబాబుకు షాక్ ఇస్తున్న టీడీపీ శ్రేణులు ?

కే‌సి‌ఆర్ కాంగ్రెస్ కు మద్దతిస్తాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -