Tuesday, May 21, 2024
- Advertisement -

ప్ర‌యాణీకుల‌కు షాక్ ఇచ్చిన రైల్వే….

- Advertisement -

రైల్వే ప్ర‌యాణీకుల‌కు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. రైలు ప్రయాణికులు ఇకపై ఎలాంటి ఉచిత బీమా సదుపాయాన్ని పొందలేరు. సెప్టెంబరు 1 నుంచి ఈ ఉచిత బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ సీనియర్‌ అధికారి ఒకరు శనివారం వెల్లడించారు.ఇన్సూరెన్స్ అనేది ఇకపై ఐచ్చికంగా మాత్రమే ఉండనున్నట్లు తెలిపారు.

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబరు నుంచి ప్రయాణికులకు ఉచిత ప్రయాణ బీమా అందిస్తోంది రైల్వేశాఖ. రైలు ప్రయాణం చేసేప్పుడు జరిగే ప్రమాదాల్లో(ఉదాహరణకు ఉగ్రదాడి, అల్లర్లు, దోపిడీలు) వ్యక్తి చనిపోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 10లక్షల వరకు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ. 7.5లక్షల వరకు, గాయపడితే రూ. 2లక్షల వరకు బీమా కింద ఇస్తోంది.

ప్రయాణికులు వెబ్‌సైట్ ద్వారా గానీ మొబైల్ అప్లికేషన్ ద్వారా గానీ టికెట్స్‌ను బుక్ చేసుకుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలా? వద్దా? అనే ఆప్షన్స్ వస్తాయన్నారు.ఆ తర్వాత కూడా బీమా సదుపాయం అందుబాటులో ఉంటుందని, అయితే అందుకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -