Saturday, May 11, 2024
- Advertisement -

జాతీయ పార్టీకి ఉండే అర్హతలు.. BRS కు ఉన్నాయా ?

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కే‌సి‌ఆర్ ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ పార్టీని గురించిన చర్చే జరుగుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా కే‌సి‌ఆర్ వేసిన ముందడుగు ఎంతమేర సక్సస్ అవుతుందో తెలియదు గాని, అసలు జాతీయ పార్టీకి ఉండవలసిన అర్హతలు బి‌ఆర్‌ఎస్ ( BRS ) పార్టీకి ఉన్నాయా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందువల్ల ఒక పార్టీ జాతీయ పార్టీకి రూపాంతరం చెందడానికి ఉండవలసిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం..!

ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. కొన్ని షరతులు కచ్చితంగా వర్తిస్తాయి. సార్వత్రిక ఎన్నికలలో కనీసం మూడు లేదా నాలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా కనీసం మూడు రాష్ట్రాలలోనైనా ఆ పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఇంకా గత సాధారణ ఎన్నికల్లో లోక్ సభ లోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లనైనా గెలుచుకొని ఉండాలి. ఈ అర్హతలు ఉంటే ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. మరి కే‌సి‌ఆర్ ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ ( BRS ) కు జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుందా అంటే కచ్చితంగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఆయా రాష్ట్రాల నుంచి కూడా కే‌సి‌ఆర్ జాతీయ పార్టీకి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంది. ఎందుకంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు బి‌ఆర్‌ఎస్ ( BRS ) లో విలీనం అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. దాంతో ఆయా రాష్ట్రాలలో బి‌ఆర్‌ఎస్ ( BRS ) అధికారిక ప్రాంతీయ పార్టీగా పాగా వేసే అవకాశం ఉంది. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల ఎంపీలు కూడా కే‌సి‌ఆర్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో వారంతా బి‌ఆర్‌ఎస్ ( BRS ) లో చేరితే.. కే‌సి‌ఆర్ ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ ( BRS ) కు జాతీయ పార్టీగా గుర్తింపు పొండడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఇప్పటికే టి‌ఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పు ను కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారస్ చేసిన టి‌ఆర్‌ఎస్ నేతల బృందం.. బి‌ఆర్‌ఎస్ ( BRS ) గా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేందుకు ఎన్నికల సంఘం నుంచి వచ్చే తుది నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిఉంది. ఇక ప్రస్తుతం మన దేశం లో కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రధాన జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఇవి కాక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( CPI ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( CPM ) , అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ వంటి కొన్ని పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి.

Also Read

కే‌సి‌ఆర్ ఏపీలో పోటీ చేస్తే.. నష్టం ఎవరికి ?

జగన్ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే !

జనసేనలోకి చిరు ఎంట్రీ.. పవన్ ఒప్పుకుంటాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -