Tuesday, May 14, 2024
- Advertisement -

ర‌స‌వ‌త్త‌రంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయం… అ ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోతే వైసీపీలోకి ….?

- Advertisement -
Jammalamadugu Rama Subba Reddy deadline to Chandrababu

జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి.ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌న్న‌ట్లు ఉంది టీడీపీ ప‌రిస్థితి.నియేజ‌క వ‌ర్గ రాజ‌కీయాలు ర‌స‌కందాయ‌లంలో ప‌డ్డాయి.

కొన్ని రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రామ‌సుబ్బారెడ్డితో …. తాజాగా బాబు స‌మావేశ మ‌య్యారు.స‌మావేశంలో గ‌త మాదిరే బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,GA1}

ప్ర‌ధానంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఏళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి.మొద‌టినుంచి ఆది రాక‌ను రామ‌సుబ్బారెడ్డి వ్య‌తిరేకించారు ..అయితే బాబు స‌ర్ధిచెప్ప‌డంతో వెన‌క్కి త‌గ్గారు.అంతేకాదు ఆయనకు మంత్రిపదవినిక కట్టబెట్టడంపై కూడ రామసుబ్బారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
ఇక ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో పాగా వేసి రామసుబ్బారెడ్డి వర్గాన్ని అణచివేస్తున్నారు.అంతేకాకుండా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామసుబ్బారెడ్డి బాబుకు ఫిర్యాదుచేశారు. తన వర్గానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఆయన పదే పదే బాబు వద్ద జరిగిన సమావేశంలో ప్రస్తావించారని సమాచారం.
చాలా రోజుల త‌ర్వాత బాబు …రామ‌సుబ్బారెడ్డితో స‌మావేశ మ‌య్యారు.తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి, శాసనమండలి చైర్మన్ గా చేయాలని చంద్రబాబు నాయుడుని సుబ్బారెడ్డి కోరారట. అప్పుడే తను తన వర్గాన్ని నిలుపుకోగలనని ఆయన బాబుకు విన్నవించుకున్నట్టు సమాచారం.అయితే అధినేత నుంచి స్పష్టమైన హామీని పొందలేకపోయారట ఈ జమ్మలమడుగు నేత. న్యాయం చేస్తాను.. తీవ్రమైన నిర్ణయం తీసుకోవద్దు అని బాబు రామసుబ్బారెడ్డికి సూచించినట్టు సమాచారం.

{loadmodule mod_custom,GA2}

ఎప్ప‌టిలాగే ఈసారి కూడా ఊర‌డించే మాటలు చెప్పారంట‌.తను కోరుకున్న పదవులు దక్కకపోతే వైసీపీలోకి వెళ్లిపోవడానికి సిద్ధమని అనుచరగణంతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.క‌శ్చితంగా వైసీపీలోకి వెల్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}vED1OYzkNJ8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -