Saturday, May 18, 2024
- Advertisement -

స‌మ‌స్య‌ల సుడిగుండాల‌ల్లో చంద్ర‌బాబు….

- Advertisement -
Chandrababu will faces many Issues for 2019 assembly Elections

కాలం క‌ల‌సిరాకుంటె తాడుకూడా పాములాగా మెడ‌కు చుట్టుకుంటాదంటారు పెద్ద‌లు.ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడి ప‌రిస్థితికూడా ఇలాగే త‌యార‌య్యంది.ఏముహూర్తాన మంత్రి వ‌ర్గం మొద‌లు పెట్టాడోగాని పాపం స‌మ‌స్య‌ల‌న్ని బాబును వెంటాడుతున్నాయి.

ఒక స‌మ‌స్య‌పోతే మ‌రొక‌టి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బాబు ప‌ర్వ‌తం అంచున కొట్టుమిట్టాడుతున్నాడు.
బాబుకుదెబ్బ మీద దెబ్బ.. సిగ్గు పడాల్సిన సందర్భాలు కోకొల్లలు. అయినా డోన్ట్‌ కేర్‌. తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్నాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందోగానీ, పార్టీ నేతలు మాత్రం ఒకర్ని మించి ఇంకొకరు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లాప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మీద అక్ర‌మ కేసులున్నాయ‌ని ఆరోపణలతో విరుచుకుపడే కొందరు టీడీపీ నేతలు, ఇప్పుడు నిందితులుగా కాదు, నేరస్తులుగా రికార్డులకెక్కేందుకు తొందరపడ్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

{loadmodule mod_custom,GA1}

ఓటుకు నోటుకేసునే తీసుకుంటే తెలంగాణలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళి, బెయిల్‌ మీద బయటకు రావాల్సి వచ్చింది.ఈ కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.ప్ర‌ధాన సూత్ర‌దారి బాబుకూడా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
ఇక, ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే మొన్న ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూముల కుంభకోణంలో అరెస్టయ్యారు.. అంతకు ముందు మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ కన్నేసింది. దాంతో ఆ ఇద్దర్నీ పార్టీ నుంచి తప్పించేశారు చంద్రబాబు.కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో పలువురు టీడీపీ నేతల పేర్లు విన్పిస్తే, జాగ్రత్తగా చంద్రబాబు ఆ వ్యవహారాన్ని నీరుగార్చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ – వనజాక్షి గొడవ సంగతి సరే సరి.
క్ర‌మశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవు..’ అని చంద్రబాబు హెచ్చరికలు ఓ పక్క జారీ చేస్తున్నా, ఆయన మాటల్ని లెక్కచేసేవారే పార్టీలోఎక్క‌డా క‌నిపించ‌వు.లేటెస్ట్‌గా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పుణ్యమా అని మరోమారు నేషనల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్మోగిపోతోంది.

{loadmodule mod_custom,GA2}

వీటికి తోడు పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన పాపానికి ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.ఆయా నియేజ‌క‌వ‌ర్గాల‌ల్లో పిరాయిపంపు ఎమ్మెల్యేల‌కు…. సొంత‌పార్టీనేత‌ల‌మ‌ధ్య విబేధాలు బ‌గ్గుమంటున్నాయి.ఇది దాదాపు అన్ని జిల్లాల్లో ఉంది. వ‌ల‌స‌ల‌సంగ‌తి చూసుకుంటె నంద్యాలకు చెందిన పార్టీ సీనియ‌ర్‌నేత శిల్పా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకొని మరింత మంది జంపింగ్ సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అన్నీ క‌ల‌సి బాబుకు మ‌న‌శ్శాంతిలేకుండా పోతోంది.మున్ముందు ఇంకెన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయే బాబుకు పాపం…

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}O5u4UKDrt2U{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -