Tuesday, May 21, 2024
- Advertisement -

2వేల నోటు సీక్రెట్ బయట పెట్టిన కేసీఆర్!

- Advertisement -
kcr reveals secret behind 2000 note

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 2000 నోటు ఎందుకు తీసుకొచ్చిందనే విషయంలో ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన వారు సైతం… అంతకంటే పెద్ద నోటును ( 2 వేల నోటు) తీసుకురావడాన్ని తప్పుబడుతున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వాదన ఇంకోలా ఉంది. పెద్ద నోట్ల రద్దు చేసి దాదాపు 20 రోజుల అవ్వగా.. కేసీఆర్ వాణిని ఇప్పుడు వినిపించింది.

కేంద్రం 2 వేల రూపాయల నోటు తీసుకురావడం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టారు. ఈ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి… రూ.2 వేల నోటు తీసుకురావడం వెనుకు కేంద్ర ప్రభుత్వ వ్యూహాం వేరే ఉందని… దాన్ని తాను ఇప్పటికప్పుడు బయటపెట్టలేనని వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడో ఒకప్పుడు రూ.2 వేల నోటును కూడా కేంద్రం రద్దు చేయడం ఖాయమనే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు.

అప్పుడు ఈ నోటు ఎందుకు తీసుకొచ్చారనే విషయం అందరికీ అర్థమవుతుందని…ఇదంతా కేంద్రం వ్యూహాంలో భాగమేనని కామెంట్ చేశారు. అయితే విలేకరుల సమావేశం అనంతరం… మార్చిలోనే కేంద్రం కొత్త రూ. 2వేల నోటును సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటుందని ఆఫ్ ది రికార్డ్ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో… మోదీ రూ. 2వేల నోటు తీసుకురావడం వెనుక ఉన్న సీక్రెట్ ను కేసీఆర్ కు వివరించినట్టు కనిపిస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు.

Related

  1. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  2. 2000 నోటు నకిలీనోటు అవునో కాదో ఇలా గుర్తించండి!
  3. ఓటు వేసేందుకు నోటు తీసుకోవడం అవినీతి కాదట..
  4. 2000 నోటులో కేంద్ర ప్రభుత్వం చిక్కులో పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -