Tuesday, May 7, 2024
- Advertisement -

సమంతకు నాగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?

- Advertisement -
what happened behind the nag given warning to samanta

అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు భార్యాభర్తలు కూడా కాబోతున్నారు. వీరి పెళ్లి వచ్చే యేడాది కాబోతుంది. అయితే సమంత పెళ్లి కారణంగా సినిమాలు బాగా త‌గ్గించేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న‌కు కాబోయే భ‌ర్త నాగ‌చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో హీరోయిన్‌గా న‌టించేందుకు ముందు ఓకే చెప్పింది.

అయితే ఆ తర్వాత ఆ చిత్రం నుంచి సమంత సడెన్ గా తప్పుకుంది. అయితే సమంత మిగిత హీరోల సినిమాలు ఒప్పుకొని తన కాబోయే భర్త సినిమా నుంచి ఎందుకు స‌డెన్‌గా త‌ప్పుకుందా అన్న సందేహాలు అంద‌రిలోను వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ చిత్రం నుంచి సమంత తప్పుకోవడానికి కారణం ఆమెకు కాబోయే మామ‌గారు నాగార్జునే కార‌ణ‌మ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. భార్యాభర్తలు కాబోతున్న ఈ జంటను చివ‌రిగా తెర‌పై చూపిస్తే బాగుంటుంద‌ని డైరెక్టర్ క‌ళ్యాణ్‌కృష్ణ భావించాడ‌ట‌.

అయితే నాగార్జున మాత్రం ఈ ప్ర‌దిపాద‌న‌కు నో చెప్పాడ‌ట‌. నాగ్ స‌మంత‌ను త‌ప్పించి ఆ ప్లేస్‌లో ర‌కుల్‌ప్రీత్‌ను ఫిక్స్ చేశాడ‌ట‌. కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందు ఒకేచోట కలిసి పనిచేయడం మంచిది కాదని, ఇద్దరి మధ్యా ఏవైనా విభేదాలు తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నాగ్‌ హెచ్చరించాడట. కాబోయే మామ‌గారు నాగ్ అలా హెచ్చ‌రించ‌డంతో స‌మంత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం స‌మంత సుకుమార్‌-రామ్‌చరణ్‌ చిత్రంలో ఓకే అయ్యినట్లు తెలుస్తోంది.

Related

  1. సమంత రిసెప్షన్ ఆ రెస్టారెంట్‍లోనట!
  2. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!
  3. సమంత, సిద్దార్ధ బ్రేకప్ కథ!
  4. చైతూ ని చీట్ చేసిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -