Saturday, May 18, 2024
- Advertisement -

కేయీ కృష్ణ‌మూర్తి డ‌మ్మీ మంత్రినా…?

- Advertisement -
KE Krishnamurthy did not get place in land acquisition committee

టీడీలో సీనియ‌ర్ నాయ‌కుడు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రిగా ఉన్న కేయీ కృష్ణ‌మూర్తికి వ‌రుస‌గా తీవ్ర అవ‌మానాలు ఎద‌ర‌వుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా నిర్ణయం వివాదాస్పదం అయింది.ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భూకేటాయింపుల కమిటీలో ఇద్దరు జూనియర్ మంత్రులను నియమించడం విమర్శలకు తావిచ్చింది.కేఈ అధీనంలోని రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూకేటాయింపుల వ్యవహారం పర్యవేక్షించాల్సి ఉంటుంది.ఇద్దరు జూనియర్ మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి అందరినీ విస్మయపరిచింది.

నిజానికి భూముల వ్యవహారాలన్నీ ఆయన శాఖ చూడాల్సి ఉండగా..మూడేళ్ల నుంచి మున్సిపల్ మంత్రి నారాయణకు అప్పగించారు. రాజధాని భూముల వ్యవహారాలన్నీ నారాయణ నేతృత్వంలోనే జరుగుతున్నాయి. దీనిపై అప్ప‌ట్లో అనేక ఆరోప‌నులు వెల్లు వెత్తాయి.తాజా కమిటీలో యనమల రామకృష్ణుడు నారాయణతోపాటు కొత్తగా మంత్రివర్గంలో చేరిన లోకేష్ నక్కా ఆనంద్ బాబుకు స్థానం కల్పించడం విమర్శలకు కారణమయింది. క‌మిటీలో రెవిన్యూ మంత్రిని వేయకుండా కావలసిన పనులు చేసుకునేందుకే జూనియర్లతో కమిటీని భర్తీ చేశారని విపక్షాలు తప్పుపడుతున్నాయి.

విశాఖ భూముల వ్యవహారంలో ప్రత్యక్షపాత్ర పోషిస్తున్న లోకేష్ కు అదే కమిటీలో స్థానం కల్పించడం ఎందుకో ప్రజలకు సులభంగానే అర్థమవుతోందని విపక్షాలు పేర్కొంటున్నాయి. భూకేటాయింపుల కమిటీవంటి కీలకమైన కమిటీలో స్థానం దక్కించుకున్న లోకేష్.. ప్రభుత్వంలో తన స్థానమేమిటో చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఇకపై ప్రభుత్వం వేసే అన్ని సబ్ కమిటీల్లోనూ లోకేష్ ఉండబోతారన్న సంకేతాలకు ఇది నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా రాజకీయాల్లో ముఖ్యమంత్రికి సమకాలికుడు అయిన కేఈకి ఇది ఊహించని పరాభవమని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

{youtube}cwExrxwWifI{/youtube}

Related

 

  1. ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలు ప్రభుత్వం ఒప్పుకుంటే త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
  2. ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలు ప్రభుత్వం ఒప్పుకుంటే త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
  3. శిల్పా వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు తెర‌పైకి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి
  4. బాధితురాలి పట్ల అత్యంత క్రూరంగా వ్య‌వ‌హ‌రించారు వారిపై సానుభూతి చూపలేమన్న‌ సుప్రీం కోర్టు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -