Monday, May 20, 2024
- Advertisement -

కీరతో అధిక బరువుకు చెక్‌!

- Advertisement -

ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు కీర దోసను ఆహారంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వేసవిలో కీర దోసకాయలను తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. అంతేగాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, జీవక్రియను మెరుగు పర్చడానికి దోహదం చేస్తుంది. దోసకాయలలో కేలరీలు తక్కువగా ఉండి, నీరు-ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది వేసవిలో కీర దోసను తినడానికి ఇష్టపడతారు.

అయితే కీర దోసతో శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవడమే కాదు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో వేడితో పాటు కొవ్వును తగ్గించుకోవడానికి కీర దోస చక్కని ఆహారం. దోసకాయలు మంచి పోషణను అందిస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఒక కప్పు దోసకాయలో దాదాపు 16 కేలరీలు ఉంటాయి. వేసవిలో కీరదోసకాయను స్నాక్‌గా తీసుకోవచ్చు.

దోసకాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఆహారంలో ఎక్కువ కేలరీలు లేకుండా ఆకలి తగ్గేందుకు సాయపడుతుంది.
ఫైబర్ ఎక్కువసేపు నిండుగా ఉంచడం ద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక రకాల పోషకాలను అందించడంలో దోసకాయలు అద్భుతంగా సాయపడతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -