Sunday, May 5, 2024
- Advertisement -

తమిళ యువతికి కొరియా పురస్కారం..!

- Advertisement -

దక్షిణ భారతదేశంలో కొరియా భాషను వ్యాప్తి చేయడానికి గత 14 ఏళ్లుగా కృషి చేస్తున్నందుకు గాను.. చెన్నైకి చెందిన ఐఎన్​కేఓ సెంటర్​ డెరెక్టర్​ రతి జాఫర్​కు తమ దేశ అత్యున్నత పురస్కారం అందించాలని నిర్ణయించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ఈ మేరకు కొరియా ‘ప్రధానమంత్రి పతకం’ అందించనున్నట్లు ఓ ప్రకటన చేసింది చెన్నైలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయం. ఈ మేరకు సదరు యువతిని సంప్రదించినట్లు తెలిపింది.

ఐఎన్​కేఓ కేంద్రాన్ని 2006లో టీవీఎస్​, హ్యూందయ్​ మోటర్స్​ సాయంతో నెలకొల్పాం. థియోటర్​ ఆర్ట్స్​, నృత్యం, సంగీతం, చిత్ర కళతో సహా ఇతర కళల్లో ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది. ఈ పురస్కారం ప్రస్తుతం నాకు, ముఖ్యంగా దక్షిణ భారత్​లో కొరియా భాష అభివృద్ధికి అందిన గౌరవం. ‘ అని రతి జాఫర్​ పేర్కొన్నట్లు కొరియా రాయబార కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.

కొరియా నేర్చుకోవాలనుకుంటున్న వారికి మాతృ భాష కొరియా కలిగిన ఉపాధ్యాయులతోనే నేర్పిస్తున్నట్లు తెలిపారు జాఫర్​. చెన్నైలోని కొరియా సంస్థల్లో పని చేస్తున్న వారికి, ఉన్నత చదువుల కోసం కొరియా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ఇతర జిల్లాల వారికి ఈ-లర్నింగ్​ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. చెన్నైలోని శ్రీపెరుంబదుర్​ ప్రాంతంలో సుమారు 300లకుపైగా కొరియన్​ కంపెనీలు ఉన్నాయి.

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!

చికెన్ చేసిన మాయ.. వింటే మీరు షాక్ తింటాారు!

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -