Monday, April 29, 2024
- Advertisement -

ట్రంప్ 232.. డెమొక్రాట్ కి 306.. నయా లెక్కలు..!

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల లెక్కలు దాదాపుగా తేలాయి. ప్రెసిడెంట్​ ఎలక్ట్​ జో బైడెన్​ శుక్రవారం.. ఆరిజోనాలో గెలుపొందారు. జార్జియాలో గెలుపునకు అతిసమీపంలో ఉన్నారు. ఫలితంగా ఈ డెమొక్రాట్​ అభ్యర్థి ఎలక్టోరల్​ ఓట్ల సంఖ్య 306కు చేరినట్లు అంచనా వేస్తున్నారు. నార్త్​ కరోలినాలో విజయానికి దగ్గరైన ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి 232 వద్దే ఆగిపోనున్నారు.

ఈ మేరకు న్యూయార్క్​ టైమ్స్​, సీఎన్​ఎన్​, ఇతర వార్తాసంస్థలు నివేదించాయి. దాదాపు ఓట్ల లెక్కింపు పూర్తయిన వేళ.. ఫలితాలపై ఇలా అంచనాలు వేశాయి.

ఇవి అచ్చం 2016 అధ్యక్ష ఎన్నికలను ప్రతిబింబించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు డొనాల్డ్​ ట్రంప్​నకు 306.. డెమొక్రాట్​ అభ్యర్థి హిల్లరీ క్లింటన్​కు 232 ఎలక్టోరల్​ ఓట్లు దక్కాయి. ఇప్పుడు కూడా అవే సంఖ్యలో ఎలక్టోరల్​ ఓట్లు రావడం అరుదైన విషయం. కానీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి.

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

టీకా పై ట్రంప్ కీలక ప్రకటన..!

కమలా హారిస్ కీలక ప్రకటన .. వారికి పన్నులు పెంచము..!

ట్రంప్ లో ఆశలు..అలస్కాలో విజయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -