Friday, April 19, 2024
- Advertisement -

చిరుత వర్సెస్​ కుందేలు.. మధ్యలో అడవిపంది.. ఈ సీన్​ మామూలుగా లేదు..!

- Advertisement -

చిరుతపులి ఎంత యాక్టివ్​గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత వేగంగా పరిగెత్తే అతి క్రూరమైన మైన జంతువు చిరుత. వేటాడి వెంటాడి చంపుకుతినడం దాని నైజం. అడవిలో సింహం రారాజు అయితే దాని తర్వాత అతి క్రూర జంతువు చిరుత. అడవిలో ఏ జంతువు నైనా వేటాడి చంపుతుంది. చిరుత వేగం దానికి ప్లస్ పాయింట్. అందుకే తన కంట పడ్డ ఏ జంతువును అయినా వేటాడి వెంటాడి మరీ చంపుతుంది.

అయితే క్రూర మృగం అయిన చిరుత కుందేలును వేటాడే క్రమంలో అడ్డుగా వచ్చిన అడవి పందికి భయపడి పారిపోయినటు వంటి వీడియో ప్రస్తుతం వైరల్​ గా మారింది. ఈ వీడియో చూసిన వారు అడవి పందికి చిరుత భయపడి పారిపోడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయానికి వస్తే..

ఓ చిరుతపులి చాలా ఆకలిమీద ఉంది. ఆహారం కోసం అడవిలో వెతుకుతోంది. దానికి ఓ కుందేలు కనిపించింది. ఇంకేముంది దానిని వేటాడటం మొదలు పెట్టింది. కుందేలు కూడా వేగంగా పరిగెత్తే జంతువు. చిరుత ఒక్క ఉదుటున కుందేలు వైపు పరిగెత్తింది. కుందేలు కూడా పరిగెత్తసాగింది. చిరుత వేగం దాటికి కుందేలు కొన్ని క్షణాల్లోనే దొరికిపోయింది. చిరుత .. కుందేలును నోటకరుచుకున్నది. మరి కొన్ని సెకండ్లలో తినడమే తరువాయి. అప్పుడొచ్చింది ఆపద్భాండావుడిలా అడవి పంది.

అదోస్తే ఏంటీ అనుకుంటే పొరపాటే. పరుగున వస్తున్న అడవి పందిని చూడగానే చిరుత నోట కరుచుకున్న కుందేలును వదలి పెట్టి భయంతో పరుగులు తీసింది. ఆ వీడియోలో చాలా దూరం వరకు అడవి పంది చిరుతను తరమడం కనిపిస్తుంది. అడవిలో ఈ ఫైట్ ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో, సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది.

Also Read

కళ్లముందే పులి ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపేసింది? అతను పరిస్థితి ఏంటంటే ..!

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -