Monday, June 17, 2024
- Advertisement -

మర్రి శశిధర్ రెడ్డి రూటే వేరు, ఆదరకోట్టారు

- Advertisement -

గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహారం లో విచారణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విచారణ బృందానికి కొత్త అనుభవం ఎదురైంది, తెలంగాణా ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కోసం సిద్దమైన వివిధ పార్టీ నేథలకి మర్రి శశిధర్ రెడ్డి విభిన్నంగా ఉన్నారు.

ఎన్నికల సంఘం ఊహించిని ఆధారాలతో ఆయన ఎన్నికల సంఘం ని అప్ప్రోచ్ అయ్యారు. తమ వాహనాలలో పెట్టెల కొద్దీ నోటీసులు తీసుకుని వచ్చిన ఆయన షాక్ ఇచ్చారు. 

ఓటర్లకు నోటీసులు జారీ చెయ్యకుండా ఉన్నప్పటికీ వీటిని మాత్రం మునిసిపల్ కార్యాలయాల్లో పెట్టేసి ఉంచారు శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మున్సిపల్ కార్యాలయాల్లో ఉంచిన నోటీసు కట్టలని ఆయన సేకరించి తెచ్చారు.  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించినట్లు పైకి కనిపించని శశిధర్ రెడ్డి ఆధారాలు చూసి ఎన్నికల సంఘం అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. గ్రేటర్ పరిధి లో ఓట్ల తొలగింపు జరిగింది వాస్తవం అనేది నిరూపిస్తూ ఈ పని చేసారు ఆయన. 

పెట్టల కొద్దీ నోటీసుల్ని చూసిన ఎన్నికల సంఘం అధికారులు.. సదరు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించటంతో పాటు.. ఎందుకు జారీ చేయలేదు? నోటీసుల్లో ఉన్న వారి ఓటు హక్కును తీసేసారా? లేదా? లాంటి ప్రశ్నలతో తెలంగాణ అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -