Monday, May 20, 2024
- Advertisement -

బాబు ఒప్పుకుంటే.. సీఎం గా చేయడానికి రెడీ – కేటీఆర్

- Advertisement -
Minister Ktr As One Day Cm In Ap

తెలంగాణలో.. కేటీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నతమైన చదువులు చదివిన.. కేటీఆర్.. ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. తన తండ్రి.. తెలంగాణ సీఎం.. కేసీఆర్ ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రజల కోసం.. దాదాపు పద్నాలుగు యేండ్ల జరిగిన ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకమైన పాత్రను.. పోషించారు.

{loadmodule mod_custom,GA1}

తాజాగా ఐటీ మినిస్టర్ గా.. తెలంగాణ నిర్మాణంలో.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు మినిస్టర్ కేటీఆర్. అయితే కేటీఆర్ అన్ని వేళల ప్రజలకు చాలా దగ్గర్లో ఉంటారు. కేవలం డైరెక్ట్ గా కాకుండా.. అవసరంకు దగ్గట్లు ఏది కుదిరితే… దాని ద్వారా సమస్యలపై పరిష్కరం తెలుపుతారు. అయితే ఈ నెపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా ప్రజలకు ,యువతకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కేటీఆర్. ఈ నెపథ్యంలో.. ట్విట్టర్ లో ఎవరైన సమస్యల గురించి.. పోస్టు పెడితే.. సెకన్స్ లో కేటీఆర్ వాటిపై స్పందిస్తూ.. ఆ సమస్యలను తీరుస్తూ.. అదరహో అనిపించుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

ఈ క్రమంలో.. ఏపీ కి చెందిన ఈ వ్యక్తి.. మంత్రి కేటీఆర్ ను ఓ కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటంటే.. ఒక్క రోజు సీఎం గా ఏపీలో ఉండమని కోరాడు. విషయంలోకి వెళ్తే.. సాయి కిరణ్ రెడ్డి అనే వ్యక్తి.. ట్విట్టర్ లో ” కేటీఆర్ సార్.. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాలో విలన్ రఘువరన్ ఇంటర్వ్యూలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ ని ఉండమని సవాలు విసురుతారు. దాంతో అర్జున్ ఒక్కరోజులోనే ప్రజలకు చాలా సమస్యలను తీరుస్తాడు. అవినీతి అక్రమాలను అరికడతాడు.

సేమ్ అలానే.. ఏపీలో కూడా ఒక్క రోజు సీఎం గా ఉండాలని ఆ వ్యక్తి కోరాడు. ఈ ట్వీట్ కి స్పందించిన మంత్రి కేటీఆర్.. ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును.. అడగండి.. ఆయన ఒక్కరోజు సీఎం గా నన్ను ఒప్పుకుంటే.. నేను ఒక్కరోజు సీఎం గా చేయడానికి రెడీ.. మీ జీవితాలు మార్చి.. మీ జీవితాల్లో మంచి వెలుగులు తీసుకొస్తా అని జవాబు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ని సోషల్ మీడియాలో బాగా షేర్లు అవుతుండటంతో.. ఏపీలో ఇది సంచలనం అయింది.

{youtube}g4Nnz4n5w70{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -