Wednesday, May 15, 2024
- Advertisement -

ప్ర‌జ‌ల డ‌బ్బుల‌ను మంచినీల్ల‌లా ఖ‌ర్చు పెడుతున్న బాబు

- Advertisement -
GO Released Babu’s Hyderabad residence treated one more official residence

ఆంద్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడు ఎక్క‌డికి వెల్లినా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చేది ఒకే ఒక్క మాట‌.అది ఏపీ పేద‌రాష్ట్రం ….అభివృద్దికి స‌హాయండ‌ని అడుక్కోవ‌డం.అంత వ‌ర‌కు బాగానే ఉంది.కాని పేద రాష్ట్ర‌మ‌ని చెప్పి ప్ర‌జ‌ల సొమ్మును సొంత విలాసాల‌కు వాడుకోవ‌డం బాబు ఎక్క‌వ అయ్యింద‌నే వార్త వైర‌ల్‌గా మారుతోంది.

రాష్ట్ర విభిజ‌న త‌ర్వాత ఆంద్ర‌ప్ర‌దేశ్ ఆర్థికంగా పూర్తిగా వెనుక‌బ‌డిన రాష్ట్రం. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రభుత్వ సొమ్మును తమ విలాసానికి వినియోగించడంలో తెలుగుదేశం అధినేతకు ఒక హద్దంటూ లేకుండా పోయిందని ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తూ బాబుగారు విలాసాల జీవితం గడిపేస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

హైద‌రాబాద్‌లో సొంత ఇళ్లు క‌ట్టుకొనేంత వ‌ర‌కు పార్క్ హయత్ లోనే నివాసం ఉంది చంద్రబాబు కుటుంబం. ఒకవైపు విజయవాడ ప్రాంతంలో ఒక అధికార నివాసాన్ని నడిపిస్తూనే, ఆ హోటల్లో ప్రతి నెలా కొన్ని లక్షల రూపాయల మొత్తాన్ని చెల్లించి బాబు ఫ్యామిలీ నివాసముంది. ప్ర‌తి పైసా ప్ర‌జ‌ల సొమ్మే.
ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లో ఒక అధునాతన భవంతిని నిర్మించుకుంది. ఈ అధునాతన భవంతిని చంద్రబాబు అధికార నివాసంగా మార్చుతూ తాజాగా జీవో ఇచ్చారు.
ప్ర‌స్తుతం విజయవాడ ప్రాంతంలో ఒక అధికారిక నివాసం, సొంతూరు నారావారి పల్లిలో ఒక అధికారిక నివాసం.. ఆ రెండూ గాక హైదరాబాద్ లోని బాబు కుటుంబం ఇల్లు కూడా అధికారిక నివాసమే. మరి ఈ ఇంటిని అధికారికనివాసంగా మార్చడంతో దీని నిర్వహణ అంతా ప్రభుత్వం మీద భారంగా మారనుంది.చంద్ర‌బాబేమో విలాస‌జీవితం గ‌డుపుతూ ప్ర‌జ‌ల క‌డుపు మారుస్తార‌న‌డంలో సందేహంలేదు.

{loadmodule mod_custom,GA2}

ఇలా ప్రతి నెలా అధికారికి నివాల‌కు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల రూపాయల ను వెచ్చించనున్నారు. ఒకవైపు మనది పేద రాష్ట్రం అంటూ శ్రీరంగ నీతులు చెబుతూనే.. మరోవైపు ఇంత విలాసాలకు తెగిస్తున్నారు.సొంత విలాసాల మీద ఉన్న బాబు దృష్టి ….కాస్త రాష్ట్ర అభివృద్దిమీద మ‌న‌సు పెడితే బావుంటుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -