Monday, May 13, 2024
- Advertisement -

త్వ‌ర‌లో జ‌న‌సేన‌లోకి రోజా….ఇప్ప‌టికే మంత‌నాలు పూర్తి…

- Advertisement -
mla roja join in jenasena

వైసీపీలో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకోబోతోంది.పార్టీ ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న రోజా పార్టీని వీడ‌నున్నార‌నే వార్త‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.ఆమె త్వరలోనే పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరనున్నారా? నాగబాబు ద్వారా రోజా పవన్ కల్యాణ్ ను కలిశారా? ఆమెను జనసేనలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారా వార్త వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,GA1} 

వైసీపీలో త‌న పాత్ర త‌గ్గుతోంద‌ని అందుకే…వైసీపీ ఎమ్మెల్యే రోజా త్వరలోనే ఆ పార్టీని వీడి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో ఇచ్చినంత ప్రాముఖ్యత ఇప్పుడు తనకు ఇవ్వడం లేదని రోజా మధనపడుతున్నట్లు సమాచారం. ఇటీవల విశాఖపట్టణంలో వైసీపీ నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టారు. దీనికి కారణం.. ఆ పార్టీ అధినేత జగన్ క్లాస్ పీకడమే అనే వార్తలు గుప్పుమన్నాయి.ఈమ‌ధ్య‌న వైసీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ నిర్వ‌హించిన స‌ర్వేలో రోజాకు వ్య‌తిరేకంగా రిపోర్టు వ‌చ్చిందంట‌.ఈ రిపోర్టులో ప్రజా సమస్యలపై పోరాడాల్సిందిపోయి మీడియాలో హైలైట్ కావడానికి రోజా చేస్తున్న ట్వీట్లు ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా సర్వే ద్వారా తేల్చారు.

{loadmodule mod_custom,GA2} 

బుల్లితెరపై టాప్ రేటింగ్ షోగా పేరుతెచ్చుకున్న ‘జబర్దస్త్‌’లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుపవన్ తో మాట్లాడార‌ని…పవన్ కల్యాణ్ రోజాకు జనసేనలో సాదరస్వాగతం పలికారని మరో ఊహాగానం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.రోజా కూడా రాయలసీమ నుంచే ఎంపీగా నిలబడే ఏర్పాట్లు.. ఒప్పందాలు జరుగుతున్నట్లు వినికిడి. మొత్తానికి ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే ఎమ్మెల్యే రోజా వైసీపీని వీడి జనసేనలో చేరడం ఖాయమంటున్నారు.

{youtube}OJuYzidh4y8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. వైసీపీ త‌ల‌పెట్టిన సేవ్ విశాఖ‌కు డుమ్మాకొట్టిన రోజా….
  2. రోజాలో మార్పు రాలేదా….? తీరుమార్చుకోక‌పోతే వేటు త‌ప్ప‌దా…?
  3. జబర్దస్త్ ప్రోగ్రాంకి నాగబాబు రోజా పారితోషకాలు ఇవే
  4. చంద్ర‌బాబుపై వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా సంచ‌ల‌న సెటైర్లు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -