Thursday, March 28, 2024
- Advertisement -

పాక్ లో గుడి కూల్చిన ఘటనలో.. ఏకంగా వందకు పైగా అరెస్ట్..!

- Advertisement -

పాకిస్థాన్​లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనలో ప్రధాన నిందితుడిని అక్కడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి పేరు ఫైజుల్లా అని, కరాక్​ జిల్లాలో అదుపులోకి తీసుకున్నామని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రధాన పోలీస్ అధికారి సనావుల్లా అబ్బాసి వెల్లడించారు. అల్లరి మూకలను ప్రేరేపించి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయించిన కేసులో ఫైజుల్లానే సూత్రధారి అని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 110 మందిని అరెస్టు చేసినట్లు అబ్బాసి తెలిపారు.

గతవారం రాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.కూల్చిన గుడిని పునర్నిర్మిస్తామని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పాక్ సూప్రీంకోర్టు కూడా హిందూ గుడిని పునర్నిర్మించాలని ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది.

పాక్​కు అప్పగింత.. భారత్ మంచి తనం!

ఇక బీచ్‌ల్లో మందు తాగితే రూ.10వేలు చొప్పున జరిమానా..!

తలొగ్గిన ట్రంప్.. అధికార బదిలీకి సహకారం..!

హెచ్1బీ విసా ఎంపిక ప్రక్రియలో మార్పులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -