రాజ్యసభ ఛైర్మన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని చెప్పారు.
పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసినవి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదని.. ఆవేశంలో మాట్లాడాడని వివరణ ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచాలని అనుకోలేదని వెల్లడించారు.
సోమవారం ఉదయం సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు జీరో అవర్ మొదలుపెట్టి ఓ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ లేచారు. అందుకు ఛైర్మన్ స్పందిస్తూ ఏ నిబంధన కింద లేవనెత్తుతున్నారని అడిగారు. రూల్ 238(5), 283(3) ప్రకారం తాను మీ దృష్టికి తీసుకువస్తున్నా అని అనడంతో… అయితే విషయం చెప్పండని వెంకయ్యనాయుడు సూచించారు.
పోలింగ్ బూతు ఏజెంట్ మృతి..గుండెపోటు రావడానికి కారణం..!
రష్మికకు ఇలాంటి వీడియోలు చేయడం మొదటిసారట!
ప్రియాంకపై కన్నేసిన సలార్ డైరెక్టర్!