Monday, April 29, 2024
- Advertisement -

షర్మిల ముందున్న ఆప్షన్‌ జగనేనా !

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిల ఎందుకు తటపటాయిస్తోంది…?అగ్రనేతలు హామీ ఇచ్చిన హస్తం గూటికి చేరేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?ఇదిగో విలీనం అంటే అదిగో విలీనం అని వార్తలు వస్తున్న షర్మిల ఎందుకు స్పందించడం లేదు. అసలు షర్మిల ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదే చర్చనడుస్తోంది.

హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సీడ్యబ్లూసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి. అనంతరం తుక్కుగూడలో భారీ బహిరంగసభ కూడా జరిగింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఆరు గ్యారెంటీ స్కీంలను ప్రకటించారు. ఇంతవరకు బాగానే పలుమార్లు సోనియాతో షర్మిల భేటీ కావడంతో ఆమె తన పార్టీని వైఎస్‌ఆర్‌టీపీనీ కాంగ్రెస్‌లో విలీనం చేయడం పక్కా అనుకున్నారు అంతా. అంతేగాదు ఆమె తుక్కుగూడలో జరిగే సభలో హస్తం గూటికి చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరుగలేదు.

పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కాంగ్రెస్‌లో చేరడాన్ని ఏటు తేల్చుకోలేకపోతున్నారు షర్మిల. ఇందుకు కారణం రాష్ట్ర కాంగ్రెస్ నేతలనే తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆమె సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవడం వల్ల నష్టం జరుగుతుందని అధిష్టానానికి చెప్పారట. తెలంగాణలో కాకుండా ఏపీలో షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారని సమాచారం. ఇదే విషయం షర్మిలతో పార్టీ అగ్రనేతలు చెప్పారని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఇప్పుడే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఇష్టం లేని షర్మిల డైలమాలో పడ్డారు. ఎందుకంటే మొదటి నుండి తెలంగాణలో పోటీచేసేందుకే షర్మిల ఆసక్తికనబర్చారు. అంతేగాదు పాలేరు నుండి పోటీచేస్తున్నట్లు ప్రకటించి తన అనుచరగణాన్ని కూడా తయారుచేసుకున్నారు. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మోకాలడ్డడం, అధిష్టానం కూడా ఇదే చెప్పడంతో ఏం చేయాలో తెలియక రాజకీయ అనిశ్చితిలో ఉన్నారు షర్మిల. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది….ఇప్పుడు వెనుకడుగు వేస్తే అది ఆమెకు మరింత డ్యామేజ్‌ అయ్యే పరిస్థితే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్‌లో చేరి అన్న జగన్‌పై పోరుకు సిద్ధం కావడమే షర్మిల ముందున్న ఏకైక ఆప్షన్‌ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -