Wednesday, May 22, 2024
- Advertisement -

పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కాని రాధాకృష్ణ…

- Advertisement -

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మరోసారి చుక్కెదురైంది.. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మహన్ రెడ్డి పరువు నష్టంకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా రాధాకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కాని రాధాకృష్ణ హాజ‌రు కాక‌పోవ‌డంతో నాంప‌ల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.

గతంలో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు, ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక తప్పుడు కథనాలు రాసిందన్నది ఆర్కే అభియోగం. ఈ కథనాలపై ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. రాధాకృష్ణ వరుసగా కోర్టుకు గైర్హాజరు అవుతుండటంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. ఈ కేసులో రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురు నిందితులు ఉండగా, వారంతా కోర్టుకు రావడంతో ఒక్కొక్కరూ రూ. 10 వేల పూచీకత్తును చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

వ్య‌క్తిగ‌త హాజ‌రునుండి మిన‌హాయింపు ఇవ్వాల‌ని రాధాకృష్న హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లుచేశారు. అయితే మినహాయింపు కుదరదని, కేసు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ సోమవారం హై కోర్టు కేసు కొట్టేసింది. దాంతో మంగళవారం కేసు విచారణకు రాధాకృష్ణ హాజరుకావాల్సుంది. కానీ కోర్టు చెప్పినా ఎండి నాంపల్లి కోర్టుకు హాజరుకాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -