Thursday, May 16, 2024
- Advertisement -

నిహారిక ‘పెళ్ళిచూపులు’ కే ఫిక్స్ అయ్యింది!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ప్లాప్ అయిన నిహారికకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఒక సినిమా రిలీజ్ కు ముందు నిహారిక గురించి హడావుడి బాగానే జరిగినా…. విడుదల తర్వాత హడావుడి పూర్తిగా మాయమైపోయింది. అందుకు కారణం ఒక మనసు సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడమే. నిజానికి నిహారికకు.. ఇతర హీరోయిన్లలా స్వేచ్ఛ లేదనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ ఇమేజ్, భారీగా అభిమానుల కలిగిన కుటుంబ నేపథ్యం ఉండటంతో ఆమె పరిమితమైన కథలు, పాత్రలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి.

అయితే తొలి సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో రెండో సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే నిహారిక రెండో సినిమాకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి స్ట్రెయిట్ సినిమాతో కాకుండా ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. పంజాబీలో మంచి విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ తెలుగు రీమేక్ గా ఆమె ఎంచుకున్నారు.

కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోగా ‘పెళ్ళిచూపులు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడట. నిహారికకు కూడా ‘పెళ్ళిచూపులు’ సినిమా బాగా నచ్చడంతో తన తర్వాత సినిమాలో విజయ్ నటిస్తే బాగుంటుందని అనుకుంటుందట. ఇక నిహారిక తొలి సినిమాలో అసలు ఎంటర్టెన్మెంట్ లేదు. సినిమా ఆడక పోవడానికి కారణాల్లో అదీ ఒకటి. అయితే ఈ సినిమాలో మాత్రం ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయట.

Related

  1. వామ్మో…నిహారిక ఇలా కూడా చేస్తుందా?
  2. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక
  3. ఒక మనసు దెబ్బ గట్టిగానే తగిలింది నిహారికకు!
  4. నాగబాబు మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -