ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పునరాగమనంలో సత్తా చాటాడు. ఇండియన్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మీట్లో ఈ పానిపట్ కుర్రాడు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలో దిగిన నీరజ్ శుక్రవారం జరిగిన పోటీల్లో జావెలిన్‌ను 88.07 మీటర్ల దూరం విసిరి.. తన పేరిటే ఉన్న రికార్డు (88.06 మీ)ను బద్దలు కొట్టాడు.
ఈ ఈవెంట్లో మొదట జావెలిన్‌ను 83.03 మీటర్లు విసిరిన చోప్రా.. ఆ తర్వాత రెండు ఫౌల్ త్రోలు వేశాడు. నాలుగో త్రోను 83.36 మీటర్లు వేసిన అతడు.. ఐదో ప్రయత్నంలో 88.07 మీటర్లు విసిరి రికార్డును తిరగరాశాడు. టోక్యోకు వెళ్లబోతున్న మరో జావెలిన్ ఆటగాడు శివ్‌పాల్ సింగ్ (81.63 మీ) రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత..!
అభిమాని చెంప ఛెల్లుమనిపించిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?
ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు.. అందుకేనా?
భారతీయులపై నేపాల్‌లో కాల్పులు.. పోలీసులు చెప్పిన కారణం ఏమిటి అంటే…!