Friday, May 17, 2024
- Advertisement -

బాబు ప్ర‌భుత్వానికి మ‌రో షాక్‌… మొద‌టి బిడ్డ‌ర్‌కు నోటీసులు

- Advertisement -

ఏపీలో గ‌త కొద్ది రోజుల‌గా స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది. అయితే భూముల వేలం విష‌యంలో ట్విష్ట్‌ల మీద ట్విష్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. కోర్టు ఆదేశాల మేర‌కు వేలం నిర్వ‌హించ‌గా రూ.60.30 కోట్ల‌కు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన స‌త్య‌నారాయ‌ణ బిల్డ‌ర్స్ సంస్త‌కు చెందిన శ్రీనివాస‌రెడ్డి ద‌క్కించుకున్నారు. క‌థ సుకాంతం అయ్యింద‌నే అనుకున్నారు కాని మ‌రో కొత్త ట్విష్ట్ తెర‌పైకి వ‌చ్చింది.

గ‌తంలో ఇవే భూముల‌ను టీడీపీ ప్ర‌భుత్వం దొంగ‌దారిని త‌క్కువ ధ‌ర‌కు కొట్టేసేందుకు వేలం నిర్వ‌హించ‌గా సంజీవ‌రెడ్డి అనే వ్య‌క్తి రూ.22.40 కోట్ల‌కు కైవ‌సం చేసుకున్నారు. కారు చౌక‌గా అధికార‌పార్టీకి చెందిన వారు ద‌క్కించుకున్నార‌నే నెపంతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో మ‌రో సారి వేలం నిర్వ‌హించింది.

అయితే వేలంలో భూముల‌ను ద‌క్కించుకున్న స‌త్య‌నారాయ‌ణ బిల్డ‌ర్స్ వాటిని తీసుకొనేందుకు నిరాక‌రిస్తున్నారు. త‌మ‌పై కొంద‌రు అస‌త్య ఆరోప‌న‌లు చేస్తున్నార‌ని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. మంత్రి ఆదినార‌య‌ణ‌రెడ్డి, మంత్రి లోకేష్‌తో సంబంధం ఉందంటూ ఆరోప‌న‌లు వ‌స్తున్నాయ‌న్నారు.

అయితే ఇప్పుడ తాజాగా ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోంది. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనురాధ ఈ రోజు సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ భూముల‌ను వేలం వేయ‌గా కడపకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ యజమానులు వాటిని రూ. 60 కోట్ల 30 లక్షలకు దక్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే, వారు డిఫాల్ట్ కావ‌డంతో రెండో బిడ్డ‌ర్‌కు అవ‌కాశం ఇస్తున్నామ‌ని అనురాధ తెలిపారు.

మొద‌టి బిడ్డ‌ర్ డిఫాల్ట్ అయినందున ఆయనకు నోటీసులు జారీ చేశార‌ని చెప్పారు. డ‌బ్బు చెల్లించేందుకు రెండో బిడ్డ‌రుకు 48 గంట‌ల గ‌డువు ఇస్తున్నట్లు తెలిపారు. మొద‌టి బిడ్డ‌ర్ కంటే రెండో బిడ్డ‌ర్ రూ.5 ల‌క్ష‌లు త‌క్కువ కోట్ చేశారు. ఇంకా ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -