Friday, May 17, 2024
- Advertisement -

పాకిస్థాన్ అణు క్షిప‌ణుల ర‌హ‌స్య స్థావ‌రం బ‌ట్ట‌బ‌య‌లు

- Advertisement -
Pakistan’s secret nuclear weapons storage facility tracked in Khyber Pakhtunkhwa

దాయాది పాకిస్థాన్ వ్యూహం భార‌త్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.ఇన్నాల్లు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఉంద‌చిన అణ్వాయుధాల గుట్టు ర‌ట్టు అయ్యింది.ఆయుధాల‌ను దాచి ఉంచిన స్థ‌లం భార‌త్‌కు అతి స‌మీపంలో ఉండ‌టంతో ఇప్పుడు భార‌త్ క‌వ‌ల‌వ‌ర ప‌డుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు దీని గురించి ఇప్ప‌టి వరకు బాహ్యప్రపంచానికి తెలియకుండా పాక్‌ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
అణ్వాయుధాల‌ను మోసుకెల్ల‌గ‌ల శ‌క్తివంత‌మైన షెహీన్ మిస్సైళ్ల‌ను పాక్ ఎక్క‌డ దాచిందో తెలిసింది.ప్ర‌మాద క‌ర అణ్వాయుధ మిస్సైల్ల‌ను ఖైబ‌ర్‌-ఫ‌క్తున్క్వాలోని పీర్‌థాన్ ప‌ర్వ‌తశ్రేణుల్లో ర‌హ‌స్యంగా దాచిపెట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఉపగ్రహం ద్వారా మిలిటరీ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం పీర్ థాన్ పర్వతం దగ్గర షహీన్-3 బ్యాలిస్టిక్ మిసైల్స్‌ను రహస్యంగా మోహరించి ఉండవచ్చునని తెలుస్తోంది.ఇటీవలి వరకు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియదని మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇది నిజ‌మే అయితే భార‌త్‌కు ఆందోళ‌న క‌ర‌మే.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ ప్రాంతంలో పాక్‌కు చెందిన షాహిన్‌-3 క్షిపణులను మోహరించింది. ఈ క్షిపణులకు 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉంది. దీని సాయంతో భారత్‌లోని అండమాన్‌ దీవులపై కూడా దాడి చేయవచ్చు. అణ్వాయుధ సామర్థ్య క్షిపణులను రహస్యంగా మోహరించడం అంటే దానిని భారత్‌కు ముప్పుగా భావించాల్సిందే. ఈ స్థావరం అమృత్‌సర్‌కు 320 కిలోమీటర్లు, ఛండీగఢ్‌కు 520 కిలోమీటర్లు, న్యూదిల్లీకి 720కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం నిఘావర్గాలు గుర్తించిన ప్రాంతలో రెండు సొరంగ మార్గాలు, మూడంచెల్లో కంచె, ఒక కార్యాలయం, మిషినికల్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, గారేజీలు, నివాస సముదాయాలు ఉన్నాయి.

{loadmodule mod_custom,Side Ad 2}

పాకిస్తాన్ శత్రువుపై తొలిసారి దాడిచేసే సామర్థ్యాన్ని పాక్‌ బలోపేతం చేసుకోని ప్రతి దాడికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. పాక్‌ రహస్యంగా అణ్వాయిధాలను భద్రపర్చే స్థావరాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. భారత్‌ దాడి నుంచి రక్షించుకోవడానికి ఇప్పటికే పలు స్థావరాలు నిర్మించింది. గూగుల్‌ ఎర్త్‌లో పలు చోట్ల పాక్‌ న్యూక్లియర్‌ స్థావరాల కోసం తవ్విన సొరంగాలను భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
అణు సామ‌ర్థ్యం క‌లిగిని క్షిప‌నుల‌ను పాక్ 2003 నుంచి 2011వరకు సొరంగాల తవ్వకాలను పాక్‌ చేపట్టింది. కాకపోతే అప్పట్లో భారత్‌కు ఈ విషయాలు తెలియకుండా పాక్‌ జాగ్రత్తలు తీసుకుంది. పాక్‌ వద్ద అధికారికంగా 140 అణువార్‌హెడ్ల్‌ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు.ఇప్పుడు భార‌త్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటుందో చూడాలిజ.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -