Thursday, May 16, 2024
- Advertisement -

నేపాల్ కు ఆవుమాంసం బిర్యానీని పంపిన పాక్!

- Advertisement -

భూకంప బాధిత నేపాల్ కు సహాయం చేస్తున్నట్టుగా చేస్తూ కొత్త వివాదాన్ని సృష్టించింది పాకిస్తాన్. తన షహజమైన వివాదాస్పద ధోరణిలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరుపై నేపాల్ ప్రజలు ఆగ్రహోద్రిక్తలు అవుతున్నారు. అసలే భూకంప తీవ్రతకు పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్లకు పాకిస్తాన్ తీరు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఈ విషయం ఇప్పటికే నేపాల్ ప్రధానమంత్రి వరకూ వెళ్లింది. దీంతో ఆయన దీనిపై విచారణకు ఆదేశించాడు. 

నేపాల్ హిందూ దేశం అనే విషయం తెలిసిందే. ప్రపంచంలో హిందూ మతాన్ని అధికారికంగా కలిగిన దేశం కూడా నేపాల్ మాత్రమే. భారత్ లో కోట్ల మంది హిందువులు ఉన్నా.. ఇది లౌకిక దేశం కాగా.. నేపాల్ మాత్రం శతాబ్దాల క్రితమే హిందూ దేశంగా ప్రకటించుకొంది. ఇక హిందువులు ఆవును, ఎద్దులను దేవతలుగా చూసుకొంటారు. ఆవు హిందూ సంప్రదాయం ప్రకారం దేవతగాకాగా.. ఎద్దు వ్యవసాయానికి పనికొచ్చే జంతువు. ఈ దేశంలో ఆవులను చంపడం శిక్షార్హమైన నేరం కూడా. మరి ఇలాంటి దేశం ఇటీవల తీవ్రమైన భూకంపాన్ని ఎదుర్కొంది. వేలమంది మరణించారు. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు నేపాల్ కు సాయం అందిస్తున్నాయి. ఆ దేశం తిరిగికోలుకోవడానికి సహకారం అందిస్తున్నాయి. ఆహారం, వస్త్రాలు, ఆర్థిక సాయం అందించడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా స్పందించింది.

నేపాల్ కు ఆహారపు పొట్లాలు పంపింది. వాటిపై ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. పొటాటో, బీఫ్ లతో ఆ హారాన్ని వండినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ ఆహారపు పాకెట్లను తీసుకొన్న వారు వాటిని భుజించక ఈ విషయాన్ని మీడియా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. నేపాల్ లో ఆవు మాంసాన్ని విక్రమించిన.. ఆవును చంపినా పన్నెండు సంవత్సరాల శిక్ష ఉంది. మరి ఇప్పుడు ఆ దేశం  పాకిస్తాన్ పట్ల ఎలా స్పందిస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -