Thursday, May 8, 2025
- Advertisement -

తిరుపతిలో భారీ సభ నిర్వహించేందుకు పవన్ ప్లాన్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో రేపు తిరుపతి లో భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసారు. ఇటివలే కర్ణాటకలోని కోలార్ లో పవన్ అభిమానికి ఎన్టీఆర్ అభిమానికి జరిగిన గొడవలో పవన్ అభిమాని వినోద్ రాయల్ చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి కి వచ్చారు పవన్. ఆ తర్వాత తిరుమల వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నారు.

వెంకన్న దర్శనం తర్వాత కొండపైనే అతిథి గృహంలో బస చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అయితే రేపు అభిమానులతో కలిసి తిరుపతిలో భారీ సభ నిర్వహించేందుకు పవన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్లెందుకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే పవన్ తిరుపతి లోనే ఉన్నాడని తెలుసుకున్న చుట్టపక్కల వారే కాక వైజాగ్, శ్రీకాకుళం , గోదావరి జిల్లాలనుండి కూడా అభిమానులు భారీగా సొంత కార్లలో తిరుపతి కి చేరుకుంటున్నారు. మరి రేపు జరిగే సభలో పవన్ సినిమాల గురించి మాట్లాడతారా? లేక రాజకీయాల గురించి మాట్లాడతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ ను ఫాలో చేస్తున్న రవితేజ!
  2. వీరాభిమాని కోసం పవన్ వెళుతున్నాడు!
  3. ఆ పాప పవన్ కళ్యాణ్ కూతురేనా ?
  4. పవన్ మనసు ఎంతమంచిదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -