- Advertisement -

పిఠాపురంలో పుష్ప 2 ఫ్లెక్సీలు చించివేత!

- Advertisement -

తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మేనియా నెలకొంది. పుష్ప 2 హంగామా ఓ వైపు అయితే మరోవైపు పిఠాపురంలో పవన్ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ఈ సినిమాను బహిష్కరించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పిలుపునిచ్చిన వేళ పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అల్లు అర్జున్‌ సినిమా పోస్టర్లు తొలగించారు. పిఠాపురంలోని పూర్ణ, సత్య, శ్రీఅన్నపూర్ణ, అనుశ్రీ తదితర థియేటర్‌లలో పుష్ప సినిమా విడుదలవుతోంది. పుష్ప 2కు సంబంధించిన పోస్టర్లను పిఠాపురంలో అతికించారు. అయితే కొందరు ఈ పోస్టర్లను చించివేశారు. పోస్టర్‌లలో అల్లు అర్జున్‌ ముఖాన్ని చించివేశారు.

ఇక రష్మిక మందన్నా ఫొటో మాత్రం చించలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా కేవలం అల్లు అర్జున్‌ ముఖాన్ని చించారని బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎంతవరకు వెళ్తుందోనన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -