- Advertisement -

సంచలనం సృష్టిస్తున్న జనసేన ట్రైలర్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తునే.. రాజకీయాలు కొనసాగుతాను అని చెప్పిన విషయం తెలిసిందే. సినిమాలు మానేస్తే.. తనకు డబ్బలు ఉండవని.. ఇటీవల తన జనసేన పార్టీ తరుపున నిర్వహించిన సభల్లో పవన్ చెప్పారు. రెండున్నరేళ్ల క్రితమే జనసేన పార్టీని స్థాపించిన పవన్.. ఎన్నికల ముందు మాత్రమే హడావుడి చేయడం జరిగింది.

అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మళ్లీ జనసేన కార్యక్రమాలు, సభలతో హడావుడి మొదలు పెట్టారు. 2019 ఎన్నికలే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం ప్రారంభించారని టాక్. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట స్థాయిల్లో కమిటీలు వేసి క్యాడర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండటం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం అలాంటి ప్రయత్నాలు కాకుండా కాస్త భిన్నంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి కమిటీలు వేయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా ద్వారానే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమా స్టైల్ లో పార్టీకి పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ లాంటివి మనం సినిమాల విషయంలోనే వింటుంటా. రాజకీయాల్లో ఇలాంటి పదాలు కానీ, ఇలాంటి పోకడలు కానీ కనిపించవు, కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ డిఫరెంటు ముందుకెలుతోంది. తాజాగా జనసేన ట్రైలర్ రిలీజ్ చేసారు. అంటే త్వరలో పూర్తి సినిమా చూపించబోతున్నారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తారన్నమాట.

{youtube}g0jwR93Zn9Y{/youtube}

{youtube}EPG6EKiHoBM{/youtube}

Related

  1. చిరు రెబల్ స్టార్ అయితే.. బన్నీ పవర్ స్టార్!
  2. పవర్ స్టార్ కోసం కొరటాల శివ ఏం చేస్తున్నాడో తెలుసా?
  3. పవన్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
  4. కొరటాల డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా పవన్ సినిమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -