Sunday, May 12, 2024
- Advertisement -

చిరు రెబల్ స్టార్ అయితే.. బన్నీ పవర్ స్టార్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కి ఏ రెంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. దాదాపుగా 8ఏళ్ల సుధీర్గ విరామం మళ్లీ చిరు తన 150వ సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే చిరుతో ఒక మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు నిర్మాతలు. అయితే ఆ మల్టీ స్టారర్ సినిమాలో స్టైలీష్ స్టార్ బన్నీ అయితే ఇంకా బావుంటుంది మరికొందరు అనుకున్నారు. అసలు సంగతి ఏంటంటే… మనకు మాదిరిగానే….కన్నడలో కూడా రెబెల్ స్టార్….పవర్ స్టార్ ఉన్నారు. అదే…రెబెల్ స్టార్ అంటే…మన అంబరీష్, పవర్ స్టార్ అంటే మన పునీత్ రాజ్ కుమార్. అక్కడ వారికి మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా వాళ్ళిద్దరూ కలిసి ఓ చిత్రం చేశారు. ‘దొడ్డమానే హడ్గ’ పేరుతో ఓ సినిమా రూపొందింది.

సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నారు కొందరు దర్శక నిర్మాతలు. అయితే ఈ రిమేక్ లో అల్లు అర్జున్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే పర్‍ఫేక్ట్ అని అంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది….మరి కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను.. తెలుగులో ఎవరు చేస్తారు అన్న సందిగ్ధంలో ఉన్న దర్శక నిర్మాతలు…ఈ పాత్రను…మెగాస్టార్ చిరంజీవితో చేయిస్తే….ఈ సినిమా సరికొత్త రికార్డులకి వేదికగా మారుతుంది అని ఆలోచిస్తున్నారు…మరి ఈ పాత్ర చేసేందుకు మన మెగాస్టార్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Related

  1. చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!
  2. ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!
  3. అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథం స్టోరీ లీక్!
  4. అల్లు అర్జున్ వద్దు అంటే ఎన్టీఆర్ ఓకే అంటున్నాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -