Friday, March 29, 2024
- Advertisement -

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

- Advertisement -

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పింక్ రీమెక్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యి.. విడుద‌ల సంబంధించిన చివ‌రి ప‌నుల‌ను పూర్తి చేసే ప‌నుల్లో చిత్ర యూనిట్ బిజీబిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ఇదివ‌ర‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మిగ‌త సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగా విభిన్న క‌థాంశాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్త చేయాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. వ‌ప‌న్ సినీ కెరియర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు. 17 శాతాబ్దం నాటి ప‌రిస్థితుల‌ను చూపించ‌డానికి భారీ సెట్‌ను సైతం హైద‌రాబాద్ శివారులో ఏర్పాటు చేస్తున్నారు.

దీనిని సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉండ‌గా, ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, సినిమా టైటిల్‌ను మ‌హాశివ రాత్రి (మార్చి 11) రోజున విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా, ఈ చిత్రానికి ఫిలీం ఛాంబ‌ర్‌లో ఇటీవ‌ల రిజిస్ట‌ర్ చేసిన రెండు టైటిల్స్ ‘హరిహర మహాదేవ’, ‘వీరమల్లు’ టైటిల్స్ ను క‌లిపి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే పేరు పెట్ట‌నున్న‌ట్టు సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో వ‌జ్రాల దొంగ‌గా క‌నిపిస్తున్న ప‌వ‌న్ స‌ర‌స‌న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

అల్లరి న‌రేష్ తో దిల్ రాజు సినిమా !

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -