Friday, April 26, 2024
- Advertisement -

మంత్రి ఎర్రబెల్లి దగ్గిరకి సీఎం కూతురు.. మేటర్ ఏంటంటే..!

- Advertisement -

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు, విధులతో పాటు ప్రోటోకాల్, వసతి సౌకర్యాలు కల్పించాలని స్థానికసంస్థల ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంత్రుల నివాస సముదాయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.

ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల రూపురేఖలు మారిపోయాయన్న ఎమ్మెల్సీలు… గ్రామాలు అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించాయని తెలిపారు. టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, వంటి కార్యక్రమాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలోపేతం అయిందన్నారు.

స్థానిక సంస్థల ప్రతినిధులను గ్రామపాలనలో భాగస్వామ్యుల్ని చేయాలని ఎమ్మెల్సీలు కోరారు. మొత్తం 16 అంశాలతో మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్సీ కవిత, భానుప్రసాద్​, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్​తో సహా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ను కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

స్టూడెంట్స్ ఎమోషన్… వైఎస్ షర్మిళా రియాక్షన్…

నీటి కోసం.. తెలుగు తమ్ముళ్లు కొట్లాట.. చెన్నై బెంచ్ తీర్పు..!

ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -