Monday, April 29, 2024
- Advertisement -

ఆ కోర్టులో కూడా ట్రంప్ కి ఎదురుదెబ్బ..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్​నకు పెన్సిల్వేనియా ఫెడరల్​ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లను పరిగణలోకి తీసుకోరాదని ట్రంప్​ వేసిన వ్యాజ్యాన్ని ఫెడరల్ అప్పీల్​​ కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్​ వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్వేచ్ఛాయుతమైన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటివని న్యాయమూర్తి స్టెఫానొస్​ బిబాస్​ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు రుజువులేవని ప్రశ్నించింది.

నవంబర్​ 3న జరిగిన అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ట్రంప్​పై.. డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​ గెలుపొందారు. పెన్సిల్వేనియా సహా మిషిగాన్​, విస్కాన్సిన్​ల్లోనూ​ పైచేయి సాధించారు బైడెన్. ఈ ఎన్నికల్లో ట్రంప్​ 232 స్థానాల్లో విజయం సాధించగా.. బైడెన్​ 306 స్థానాల్లో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రిపబ్లికన్​ అభ్యర్థి ట్రంప్​.. ఎన్నికల ఫలితాలను సవాల్​ చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేశారు.

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -