Friday, May 3, 2024
- Advertisement -

మొదటి లవ్​ జిహాద్ కేసు నమోదు..!

- Advertisement -

ఉత్తర్​ప్రదేశ్​లో ‘లవ్​ జిహాద్​’కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఈ చట్టం అమలైన తర్వాత తొలిసారి బరేలీలో బలవంతపు మత మార్పిడి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ శనివారం ఆమోదముద్ర వేశారు.

తాజా ఆర్డినెన్సును అనుసరించి దేవరానియా పోలీసులు ఎఫ్​ఐఆర్ రిజిస్టర్ చేశారు. నిందితులపై సెక్షన్ 3/5 ప్రకారం ఆరోపణలు మోపారు. బలవంతంగా మత మార్పిడిని ప్రోత్సహించారని ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో ఉత్తర్​ప్రదేశ్ సహా బీజేపి పాలిత రాష్ట్రాలైన హరియాణా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు ఈ తరహా ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే ‘లవ్​ జిహాద్​’గా అభివర్ణిస్తున్నాయి.

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!

పుష్ప స్పెషల్ సాంగ్ లో ఊర్వశి..!

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -