Friday, May 17, 2024
- Advertisement -

వ‌చ్చే ఐదు సంవ‌త్స‌రాల‌ల్లో భారీగా త‌గ్గ‌నున్న క్రూడాయిల్ ధ‌ర‌లు

- Advertisement -
Petrol could be below Rs 30 a litre in 5 years

ఎప్పుడూ పెట్రోల్ ద‌ర‌లు రోజురోజు పెంచుతూ పెట్రోలియం కంపెనీలు సామాన్య ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తున్నారు. రేట్ల‌ను భారీగా పెంచ‌డం ….త‌గ్గించ‌డం మాత్రం తూతూ మంత్రంగా త‌గ్గిస్తున్నారు.

అయితే త్వ‌ర‌లోనే పెట్రోల్ రేట్లు అత్యంత దిగువ స్థాయికి రానున్నాయి. పెట్రోల్ ధ‌ర‌లు ఏంటి అంత ద‌ర‌కు అనుంకుంటున్నారా మీరు వింటున్న‌ది నిజ‌మే.
రాబోయే అయిదేళ్లలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.30 ల కంటే దిగువకు పతనం కానుందట. అమెరికన్ ఫ్యూచరిస్ట్‌ టోనీ సెబా ప్రకారం ఐదు సంవత్సరాలకు లీటరు పెట్రోల్‌ రూ. 30 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తెలుస్తోంది. భ‌విష్య‌త్తులో పెట్రోల్ కు డిమాండ్ త‌గ్గ‌డ‌టే దీనికి కారనం అంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్ర‌ధానంగా భ‌విష్య‌త్తులో సోలార్‌ పవర్‌ కు భారీగా డిమాండ్‌ పుంజుకోనుందని అంచనావేసిన… సెబా తాజాగా చమురు ధరలపై తన అంచనాలను వెల్లడించా రు. ప్రపంచ ప్రస్తుత టెక్నాలజీ భ‌విష్య‌త్తులో పెట్రోలుపై ఆధారపడటాన్ని తగ్గించనుందని తెలిపారు. సెబా ప్రకారం, సెల్ఫ్‌ డ్రైవింగ్ కార్లు,ఎల‌క్ట్రానిక్ కార్ల కారణంగా చమురు డిమాండ్‌ గణనీయంగా పతనం కానుంది. ముఖ్యంగా చమురు బ్యారెల్‌ ధర త్వరలోనే 25 డాలర్లకు దిగిరానుంది.
ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం భారీగా పెరగనుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ఈ వాహనాల ధరలు కూడా బాగా దిగిరానున్నాయని సెబా చెబుతున్నారు. అలాగే 2030నాటికి 95శాతం ప్రజలు ప్రయివేటు వాహనాలను స్వస్తి చెబుతారని, దీంతో ఆటో మొబైల్‌ పరిశ్రమ తుడిచుపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు విద్యుత్తు వాహనాల రాకతో ప్రపంచ ఆయిల్‌ పరిశ్రమ కుదేలవుతుందని అంచనావేశారు.

{loadmodule mod_custom,Side Ad 2}

మ‌రోవైపు ఈ అంచనాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ ఇటీవలి వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. 2030 నాటికి భారతదేశం లో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని ప్రకటించారు. అలాగే 15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారు విక్రయించబడదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -