Saturday, April 20, 2024
- Advertisement -

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

- Advertisement -

నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ  పెట్రోలు ధరలు స్వల్పంగా  క్షీణించాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 22 పైసలు, డీజిల్ పై 23 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు దిగి రావడంతో  పెట్రోల్, డీజిల్ ధరలు  మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూచమురు మార్కెటింగ్ సంస్థలు  నిర్ణయించాయి.

పెట్రోలుపై లీటరుకు 22 పైసలు, డీజిల్‌పై  లీటరుకు 23 పైసలు  చొప్పున తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 90.56 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరుకు 80.87 రూపాయలకు చేరింది.  హైదరాబాదులో పెట్రోలు ధర లీటరుకు రూ. 94.16, డీజిల్‌ రూ. 88.20కు చేరగా, అమరావతిలో పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్‌ ధర రూ. 90.28కు తగ్గింది.

ఇక ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 87.96కు చేరుకుంది. కోల్‌ కతాలో పెట్రోల్‌ రూ.  90.77గా, డీజిల్ ధర  రూ 83.75గా ఉంది. చెన్నైలో పెట్రోల్  ధర రూ.  92.58(19 పైసలు తగ్గింది), డీజిల్ ధర రూ.  85.88  22 పైసలు తగ్గింది.

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

పవన్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ అదుర్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -