పండుగ పూట బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు విపరీతంగా ప్రయాణికులతో కిటకిట లాడుతుంటాయి. నగరాల్లోని చాలా మంది తమ సొంతూళ్లకు వెళుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ ధరలను పెంచి ప్యాసింజర్ల జోబులకు చిల్లులు పెడుతుంటారు. ఇందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ కూడా మినహాయింపుకాదు. దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగలకు చార్జీలను పెద్ద మొత్తంలో పెంచుతూ ప్రయాణికులపై భారం మోపుతుంటుంది.
తాజాగా ఈ జాబితాలోకి దక్షిణ మధ్య రైల్వే చేరింది. సంక్రాంతికి ప్రయాణికులను నిలువునా లూటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పండగ పూట ప్లాట్ ఫాం మీద జనాలను తగ్గించాలనే నెపంతో దోపిడీకి తెరలేపింది. ఇందుకోసం ప్లాట్ ఫాం టికెట్ల రేట్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు మరో 14 స్టేషన్లలో టికెట్ రేట్లను భారీగా పెంచింది. సికింద్రాబాద్లో రూ.10 ఉన్న ధరను ఏకంగా రూ.50 చేసింది. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మరో 13 స్టేషన్లలో రూ.20 లకు టికెట్ ధరలను పెంచింది. ఈ జాబితాలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్, తాండూరు, బీదర్, బేగంపేట స్టేషన్లు ఉన్నాయి.
స్ట్రీట్ ఫుడ్ డోర్ డెలివరీ కావాలా?
నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?