నే కూడా సంక్రాతికే వస్తానంటున్న సీనియర్ స్టార్ హీరో..!

- Advertisement -

కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ననాయన సూపర్​ హిట్​ అయిన విషయం తెలిసిందే. 2016 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్​ సక్సెస్​ అయింది. పోటీలో ఇతర సినిమాల ఉన్నప్పటికీ మంచి కలెక్షన్లు రాబట్టింది. కొన్నేళ్ళపాటు సరైన సక్సెస్ లేని నాగార్జునకు మంచి విజయాన్ని అందించింది. ఇక నాగార్జున డ్యుయల్​ రోల్​లో మెప్పించాడు. రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్​ వస్తుందని రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కథ సిద్ధం చేశారని నాగార్జునకు వినిపించారని సమాచారం. అయితే అందులో నాగార్జున పలు మార్పులు సూచించినట్లు టాక్. నాగార్జున కోరిక మేరకు కళ్యాణ్ కృష్ణ అతను మార్పులు చేయడంతో ఆ సినిమా చేసేందుకు నాగార్జున అంగీకారం తెలిపారు. బంగార్రాజు పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రీక్వెల్​లో నాగార్జునతోపాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ మూవీ కూడా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తోందని సమాచారం. మొదటి సినిమా లాగే .. ప్రీక్వెల్​ను కూడా రొమాంటిక్​గా తెరకెక్కించాలని మేకర్స్​ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు -పరశురామ్ మూవీ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ మూవీ, వెంకటేష్, వరుణ్ తేజ్ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఎఫ్ 3 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు నాగ్ బంగార్రాజు కూడా పొంగల్ బరిలో నిలిచింది.

Also Read

ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

నేను సుమతో విడిపోలేదు.. కొంతకాలం విడిగా ఉన్నా.. కారణం ఏమిటంటే?

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -