మళ్లీ దోచేస్తున్నారబ్బా..!

- Advertisement -

మళ్లీ దోచేస్తున్నారబ్బా. ఈ దోపిడీకి మందే లేదా? ఎంత కాలం ఈ వాయింపుడని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఐదారొందల బస్‌ టిక్కెట్‌ పదిహేనొందలు, రెండు వేలకు అమ్ముతారా అని ఆవేదన చెందుతున్నారు.

సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా ఉండవు. తెలుగు వారికి ముఖ్యమైన ఈ పండుగను ఆంధ్రాలో ఇంకా ఘనంగా చేస్తారు. పైగా స్కూళ్లకు 8నుండి 16 వరకు సెలవులుంటాయని మందే చెప్పటంతో పండగ ఉత్సాహం ముందే వచ్చింది. హైదరాబాద్‌ నగరం నుండి ఏపీకి వెళ్లటానికి లక్షలమంది ప్లాన్‌ చేసుకుంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ట్రావెల్స్‌ పండగకు పదిరోజుల ముందు నుంచే దోపిడీ మొదలెట్టేశాయి. బస్‌ ఛార్జీలు ఫ్లైట్‌ ఛార్జీలను మించుతున్నాయి. పదో తేదీలోపు బుక్‌ చేసుకుంటే ఓ లెక్క.. ఆ తర్వాతైతే మరో లెక్క అంటున్నాయి.

- Advertisement -

ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడంలేదు. ట్రైన్ టిక్కెట్లకు ఛాన్సే లేదు. ఆర్టీసీ టిక్కెట్లు అసలే లేవు. ఇక ట్రావెల్సే దిక్కు. ఈ అవకాశాన్ని క్యాష్‌ చేసుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌. ఇష్టారాజ్యంగా.. అడ్డగోలుగా బస్‌ ఛార్జీలను పెంచేస్తున్నాయి. విశాఖ, విజయనగరం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, భీమవరం.. ఇలా ఏపీలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి వాచిపోతోంది. హైద్రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నానికి టీఎస్‌ఆర్టీసీ బస్‌ టికెట్‌ రూ.900 నుంచి రూ.1100 రూపాయల వరకు ఉంటే, ఏపీఎస్ఆర్టీసీలో వెయ్యి నుంచి రూ.1200 వరకు ఉంది. కానీ… ప్రైవేట్ ట్రావెల్స్‌లో మాత్రం నాన్ ఎసీ బ‌స్ టిక్కెట్ 1500, ఎసీకి 1800 నుంచి 2500 రూపాయలు పిండుతున్నారు. విజయవాడ టిక్కెట్టు ఐదారొందలు ఉండాల్సింది… వెయ్యి నుంచి 1900 వరకు చెప్తున్నారు. ఈ టిక్కెట్ల రేట్లు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు.

స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ కావాలా?

ఎన్నికలని ఆపలేని ఒమిక్రాన్‌

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -