Thursday, May 2, 2024
- Advertisement -

ఉచిత పథకాలతో వాళ్ళకు బాద.. మోడీ వ్యాఖ్యలు !

- Advertisement -

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న ఉచిత పథకాలపై ప్రధాని మోడీ గటకొంత కాలంగా వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఉచితల వల్ల దేశాభివృద్ది ఆగిపోతుందని, ఉచితలను నిలువరించాల్సిన అవసరం ఉందని.. సమయం దొరికినప్పుడల్లా ప్రధాని మోడీ చెబుతూనే ఉన్నారు. అయితే ప్రధాని మోడీ చేసే వ్యాఖ్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా విధ్య, వైద్యం, విద్యుత్ వంటి వాటిని ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదని, అరవింద్ కేజృవాల్, కే‌సి‌ఆర్ వంటి వారు ప్రధానికి వ్యతిరేకంగా తమ వాదనను వినిపిస్తూనే ఉన్నారు. .

ఇక తాజాగా మరోసారి ఉచితలపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచితలను అడ్డుకోవాలని ఎంతోమంది టాక్స్ పేయర్లు లేఖలు రాస్తున్నారని, పన్నుల రూపంలో వచ్చిన సోమ్మంతా ఉచితలకు కేటాయిస్తే టాక్స్ పేయర్లకు భాద కలుగుతుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఇటీవల మధ్య ప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రిమోట్ నొక్కి ప్రారంభించిన తరువాత పై విధంగా వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. ఉచిత పథకాలను ఆపాలని చాలా మంది కోరుకుంటున్నారని, ఇది చాలా సంతోషకరం అంటూ మోడీ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ” గరీబీ హఠావో ” నినాదాలు తప్ప చేసిందేమి లేదని కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గడిచిన ఎనిమిదేళ్ళలో పేదలకు 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని మోడీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

జగన్ కు పెను సవాల్ గా రోడ్ల సమస్య.. ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదా…

చంద్రబాబు చాణక్యం.. పవన్ కు కలిసొస్తుందా ?

పవన్ భూతుపురాణం వెనుక.. అసలు వ్యూహమేంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -