Monday, April 29, 2024
- Advertisement -

T20 WORLDCUP : నరాలు తెగే ఉత్కంఠ.. పాక్ పై ఇండియా చిరస్మరణీయ విజయం !

- Advertisement -

ఇండియా వర్సస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ సర్వసాధారణం. ఈ రెండు జట్ల మద్య మ్యాచ్ అనగానే ఒక సాధారణ క్రికెట్ లా కాకుండా ఒక యుద్దంలా భావిస్తారు ఇరు జట్ల ఆటగాళ్లు మరియు ఇరు దేశాల అభిమానులు. మరి అలాంటి ఇరు జట్లు వరల్డ్ కప్ లో తలపడితే.. ఆ హై వోల్టేజ్ సమరాన్ని వీక్షించేందుకు యావత్ క్రీడా ప్రపంచం అంత కల్లప్పగించి చూస్తుంది. ఇక ఆస్ట్రేలియాలో జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు గ్రూప్ బి నుంచి మెల్బోర్న్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత భాలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు.

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అసలు ఖాతనే తెరవకుండా పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ మహమద్ రిజ్వన్ కూడా (4 ) పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఆ తరువాత భారత భౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్స్ ఏ దశలోనూ నిలువలేక పోయారు. ఆ సమయంలో మసూద్ ( 42 బంతుల్లో 52 పరుగులు ) , ఇఫ్తికర్ అహ్మద్ ( 34 బంతుల్లో 51 పరుగులు ) ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాక్ 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు నిర్ధేశించింది. అయితే తక్కువ స్కోరే కదా ఈజీగా గెలిచే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ బౌలర్లు వేసే బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కోవడానికి టీమిండియా బ్యాట్స్ మెన్ ముప్పుతిప్పలు పడ్డారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కే‌ఎల్ రాహుల్ వెంటవెంటనే ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. ఇక ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించాడు.

ఇక ఆ తరువాత ధాటిగా అదే క్రమంలో యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన ఆక్సర్ పటేల్, దినేష్ కార్తీక్ కూడా వెంటవెంటనే ఔట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక కోహ్లీకి తోడుగా హర్ధిక్ పాండ్య స్కోర్ బోర్డ్ ను పరిగులు పెట్టించారు. ఈ క్రమంలో హర్ధిక్ పాండ్య బాబర్ ఆజమ్ కు క్యాచ్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. హర్తీక్ 37 బంతుల్లో 40 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇక మరో వైపు కోహ్లీ అశ్విన్ తో కలిసి జట్టుకు చిరస్మరణీయ విజయం అంధించాడు. ఒక వైపు వికెట్లు పడుతున్న.. ఒత్తిడి తారస్థాయిలో ఉన్న.. కింగ్ కోహ్లీ మాత్రం లక్ష్యం వైపే సాగుతూ 53 బంతుల్లో 82 చేసి జట్టుకు అధ్బుత విజయాన్ని అందించి, మరోసారి ఛేజింగ్ మాస్టర్ గా నిలిచాడు.

చివరి ఓవర్ నరాలు తెగే ఉత్కంఠ
నవాజ్ వేసిన 19వ ఓవర్లో మొదటి బంతికే హర్ధిక్ ఔట్ గా నిలిచాడు. ఇంకా 4 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్ లో కోహ్లీ దినేష్ కార్తీక్.. హై వోల్టేజ్ ప్రేజర్.. చేతులు మారుతున్న విజయం.. 19.3 బంతికి కోహ్లీ డబుల్ తిరగడంతో 3 బంతుల్లో 13 పరుగులు చెయ్యాల్సిఉంది. అసమయం లో కోహ్లీ సిక్స్ కొట్టడంతో ఒక్కసారిగా గెలుపుపై ఆశలు నిలిచాయి. వెంటనే నాలుగో బంతికి డికె అవుట్.. మళ్ళీ అందరిలోనూ ఉత్కంఠ క్రీజ్ లో అశ్విన్ అయితే అయిదో బంతికి అశ్విన్ తెలివిగా వైడ్ గా మలిచాడు. దీంతో ఏక రన్ రావడంతో పాటు ఎక్స్ట్రా బంతి వచ్చింది. ఇక ఐదో బంతి మళ్ళీ నో బాల్ కావడంతో స్కోర్ బోర్డ్ ఒక పరుగు లక్ష్యంలో విజయం నిలిచింది. ఉత్కంఠ గా మారిన బంతిని సింగిల్ తీయడం ద్వారా టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -