ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ.. ఘోర కారు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కారు ప్రమాదానికి గల కారణాలను.. పోలీసులు అధికారికంగా వెల్లడించారు. కారు అతి వేగమే ప్రమాదం జరగడానికి కారనమని.. దాని వల్లే నిషిత్ నారాయణ ప్రాణాలుకోల్పోయాడని వారు తెలిపారు.
ప్రమాదం జరిగే టైంలో.. నిషిత్ కారు గంటకు 242 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో పిల్లర్ల మధ్య ఉన్న దూరం 75 మీటర్లను నిషిత్ కారు 0.5 మైక్రో సెకన్లలో దాటిందని చెప్పారు. మామూలుగా అయితే సీసీ కెమారాల్లో సెకనుకు 4 ఫ్రేమ్స్ మాత్రమే రికార్డవుతాయని, కానీ, నిషిత్ కారు మాత్రం 24 ఫ్రేముల్లో రికార్డయిందని చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు అరవింద్ ఘోర బెంజ్ కారు ప్రమాదానికి గురై మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను కనిపెంటేందుకు జర్మనీ బెంజ్ ప్రతినిధులను సైతం పిలిపించి విచారణ చేయించిన పోలీసులు.. వారు ఇచ్చిన నివేదికను తీసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత 2.30గంటలకు నిషిత్ అతడి స్నేహితుడితో కలిసి జూబ్లీహిల్స్‌లో మెట్రోపిల్లర్ 36ను వెగంగా వెళ్లి డీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related